తెలంగాణ,ఢిల్లీ, ఏప్రిల్ 2 -- రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే కుల గ‌ణ‌న చేప‌ట్టామని. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు తీర్మానం చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చ‌ట్ట‌స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు రావాల‌న్నా.. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగాల‌న్నా జ‌న గ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న జర‌గాలని వ్యాఖ్యానించారు. జ‌న గ‌ణ‌న‌లో కుల గ‌ణ‌న చేర్చి దాని ఆధారంగా విద్యా, ఉద్యోగ‌, ఉపాధిలో మాత్ర‌మే కాకుండా రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు పెంచుతాం అని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారని గుర్తు చేశారు. ఆ మాట‌ను నిల‌బెట్టాల్సిన బాధ‌త్య ప్ర‌తి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌పై ఉందన్నారు.

"మేం అధికారం చేప‌ట్టిన వంద రోజులు తిర‌గ‌క‌ముందే బ‌ల‌హీన‌వ‌ర్గాల లెక్క‌లు తేల్చేందుకు శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేశాం. మా పాల‌న ఏడాది తిర‌గ‌క‌ముందే కుల గ‌ణ‌న పూర్తి చేసి బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు పెంచుతూ ఫి...