భారతదేశం, జనవరి 22 -- BC EWS Subsidy Loans : బీసీలు, ఈడబ్ల్యూఎస్ బలహీనవర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024-25 సంవత్సరానికి రాయితీపై రుణాలు అందించేందుకు బీసీ వర్గాలకు రూ.896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ రూ.384 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణాల పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59 వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రుణాలు అందించనున్నారు. అయితే లబ్దిదారుల వాటా లేకుండానే రాయితీపై రుణాలు మంజూరు చేయనున్నారు. గతంలో లబ్దిదారులు కొంత వాటా పెట్టుకుంటే, ప్రభుత్వం రాయితీపై రుణాలు అందించేది...