భారతదేశం, ఫిబ్రవరి 7 -- BC Corporation Loans: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు అందిస్తున్న బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు గడువును పొడించారు. బీసీ కార్పొరేషన్‌ రుణాలను అర్హులందరికీ అందజేయాలని, గడువులోగా యూనిట్లు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత సూచించారు.

లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు సహా వివిధ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న యూనిట్లకు దరఖాస్తుల గడవును ఈ నెల 12 వ తేదీన వరకూ పెంచుతున్నట్లు వెల్లడించారు.

గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్ లో రాష్ట్రంలో వివిధ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో రుణాలు-సద్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్ల...