Hyderabad, మార్చి 26 -- Bazooka Trailer: మమ్ముట్టి నటించిన బజూకా ట్రైలర్ బుధవారం (మార్చి 26) విడుదలైంది. మోహన్‌లాల్ నటించిన 'తుడరుమ్', నస్లెన్ నటించిన 'ఆలప్పుజ జింఖానా' ఆసక్తికరమైన ట్రైలర్‌ల తర్వాత.. ఇప్పుడు మమ్ముట్టి బజూకా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీనో డెన్నిస్ దర్శకత్వం వహించిన బజూకా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా వచ్చిన ట్రైలర్ యాక్షన్ తో అదిరిపోయింది. మమ్ముట్టి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మమ్ముట్టి ఈ చిత్రంలో వినోద్ మీనన్‌గా కనిపించనున్నాడు. ఇది ఒక గేమ్ థ్రిల్లర్‌గా మేకర్స్ చెబుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ ఎంట్రీతో మొదలైంది. అతను పోలీసు యూనిఫామ్‌లో వచ్చి.. తలుపు తెరవమని ఓ రౌడీ గ్రూప్ ను అడుగుతాడు. అతడు కొచ్చి నగర ఏసీపీ బెంజమిన్ జోషువా పాత్రలో నటించాడు. అతని కింద మంచి శిక్షణ పొంద...