భారతదేశం, ఫిబ్రవరి 18 -- Hydra Bathukamma Kunta : హైదరాబాద్ మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటలో పునరుద్దరణ పనులను మొదలుపెట్టింది. మోకాలిలోతు మట్టి తవ్వగానే నీరు ఉబికి పైకివచ్చింది. దీంతో హైడ్రా అధికారులతోపాటు స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. బతుకమ్మకుంట మళ్లీ ప్రాణం పోసుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పుష్పాలతో బతుకమ్మకుంటను స్వాగతించారు. అయితే హైడ్రా తవ్వకాల్లో డ్రైనేజీ పైపులైన్ పగిలి నీరు పైకి వస్తోందని ప్రచారం జరిగింది. జలమండలి అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించి, అక్కడ ఎలాంటి పైపులైన్ లేదని, పూర్తిగా భూగర్భ జలమే అని నిర్థారించారు.

బ‌తుక‌మ్మ కుంట బ‌తికే ఉంది. మోకాలు లోతు మ‌ట్టి తీయ‌గానే బిర‌బిరా గంగ‌మ్మ బ‌య‌ట‌కొచ్చింది. ఇక అంతే అక్కడి స్థానికుల‌లో ఆనందం పెల్లుబికింది. బ‌తుక‌మ...