భారతదేశం, ఫిబ్రవరి 3 -- Basasra Devotees: వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం అర్థరాత్రి నుంచి భక్తులు అమ్మవారి దర్శనాల కోసం ఎదురు చేస్తున్నారు.

చదువుల తల్లి సరస్వతి కొలువైన బాసర క్షేత్రం లక్షలాది భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాసరలో అక్షరాభ్యాసం చేస్తే చదువుల తల్లి కరుణిస్తుందనే నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు గోదావరిలో పుణ్యస్నానాలతో రద్దీగా మారింది. అమ్మవారి దర్శనంతో పాటు అక్షరాభ్యాసాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. అక్షరాభ్యాసాలతో నిమిత్తం లేకుండా ఆదివారం దాదాపు లక్ష మంది భక్తులు వచ్చి ఉంటారని ద...