భారతదేశం, ఏప్రిల్ 5 -- హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన బండారి రాజేందర్, కవిత దంపతుల పెద్ద కుమారుడు మణికంఠ. వరంగల్‌లో ఓపెన్ డిగ్రీ చదువుతూ స్థానిక శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి ఆలయంలోని అర్చుకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు వద్ద కొద్దిరోజులు వేద పారాయణం చేశారు. ఈ క్రమంలోనే రెండేళ్ల కిందట నిర్మల్ జిల్లా బాసరలోని వేద పాఠశాలలో చేరాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. వేద పాఠశాల తరఫున ప్రతి రోజు సాయంత్రం గోదావరి నదికి హారతి ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. హారతి ఇచ్చే ప్రదేశంలో నీళ్లు లేకపోవడంతో.. గోదావరి నదిలోని బోరు బావి పంపు సెట్ ఆన్ చేస్తున్నారు.

నదిలో ఉన్న బోరు బావి పంపును ఆన్ చేసేందుకు శుక్రవారం మణికంఠ వెళ్లాడు. అక్కడున్న ఒక రేకుపై నిలబడి మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే బోర్డు నుంచి విద్యుత్తు తీగ బయటకు వచ్చి మణికంఠ నిల్చుని...