భారతదేశం, ఫిబ్రవరి 1 -- Basara Saraswathi Temple : చదువుల మాత సరస్వతీ దేవీ కొలువై ఉన్న బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రానికి ఉత్సవకళ సంతరించుకుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈసారి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం ప్రతిసారిలాగే ఈ సారి కూడా దేవస్థానం ఆధ్వర్యంలో అదనపు క్యూ లైన్లు తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయంతో పాటు ఉప ఆలయాన్నింటికి రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఈసారి వసంత పంచమి వేడుకల ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకదృష్టి సారించింది. మొదటి నుంచి ముథోల్ ఎమ్మెల్యే రాంరావు పటేల్ వేడుకల నిర్వహణపై శ్రద్ధ వహించారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భ...