భారతదేశం, మార్చి 27 -- Barrelakka Marriage : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం రేపిన బర్రెలక్క (Barrelakka)అలియాస్ శిరీష పెళ్లి పీటలెక్కబోతున్నారు. బర్రెలక్క పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బర్రెలక్క... ఉద్యోగం లేక బర్రెలు కాస్తున్నా అంటే ఆ మధ్య సోషల్ మీడియా షేక్ చేసిన శిరీష అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేసేందుకే ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఆమె తెలిపారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలైంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క 5,754 ఓట్లతో నాల్గో స్థానంలో నిలిచింది. బర్రెలక్కకు ఇద్దరు తమ్ముళ్లు, తల్లి ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బర్రెలక్క తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తుంది. తాజాగా ఆమెకు పెళ్లి కుదిరింది. ఈ విషయాన్ని ఆమె...