ఆంధ్రప్రదేశ్,బాపట్ల, ఫిబ్రవరి 24 -- ప్రేమించాలంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువ‌కుడు క‌త్తితో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. త‌న‌ను ప్రేమించ‌క‌పోతే చంపుతాన‌ని. ఆపై నేను కూడా చ‌నిపోతానంటూ నానాయాగీ చేశాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కొల్లూరు మండంలోని ఒక గ్రామానికి చెందిన యువ‌తి పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులో ఇంజినీరింగ్ చ‌దువుతోంది. అయితే ఆమెకు గ‌తంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివే స‌మ‌యంలో కొల్లూరుకు చెందిన యువ‌కుడు గూడూరు దామోద‌రంతో ప‌రిచ‌యం ఏర్పడింది. ప‌రిచ‌యం కాస్తా మొబైల్ ఫోన్‌ ఛాటింగ్‌లు వ‌ర‌కు వెళ్లింది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న మొబైల్ ఫోన్ ఛాటింగ్‌ల వ్య‌వ‌హారం యువ‌తి త‌ల...