భారతదేశం, మే 7 -- బీచ్ చూడాలి అని చాలా మంది అనుకుంటారు. సముద్రం ఒడ్డున వచ్చే అలలు కాళ్లకు తాకుతుంటే కలిగే ఆనందం వేరు. సమద్రంలో దాగి ఉన్న అందాలు చూడాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ఇందుకోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. బాపట్ల బీచ్ వెళితే సరిపోతుంది. దీనినే సూర్యలంక బీచ్ అని కూడా అంటారు. ఇక్కడకు వెళితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చాలా మంది జంటలు ఇక్కడకు వెళ్లి బీచ్ చూసి ఎంజాయ్ చేస్తారు.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతుంది. బీచ్ చూడాలి అనుకునేవారు.. నేరుగా సూర్యలంక బీచ్ కు వెళ్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని టూరిస్టులు ఏపీలో ఉన్న ఈ బీచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. సూర్యలంక బీచ్ ఒడ్డు చాలా విశాలంగా ఉంటుంది. పర్యాటకులు బీచ్‌లో రద్దీగా ఉన్న అనుభూతిని పొందకుండా సరదాగా గడపవచ్చు. సముద్ర ప్రేమికులు ఇక్కడకు వెళితే తెగ...