భారతదేశం, ఫిబ్రవరి 12 -- Banned Chinese apps: భారత్ లో గతంలో నిషేధానికి గురైన పలు చైనా యాప్ లు మళ్లీ ప్లే స్టోర్ లలో ప్రత్యక్షమయ్యాయి. గేమింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఫైల్ షేరింగ్ సహా పలు విభాగాల్లో ఇవి ఉన్నాయి. వీటిలో కనీసం 36 యాప్స్ ఇప్పుడు ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. కొన్ని యాప్ లు బ్రాండింగ్ లో స్వల్ప మార్పులతో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. మరికొందరు డెవలపర్లు లేదా లైసెన్సింగ్ భాగస్వాములను మార్చారు.

2020లో ఇండియా భద్రతా కారణాల దృష్ట్యా 267 చైనీస్ యాప్స్ ను నిషేధించింది. ఇందులో టిక్ టాక్, షేర్ ఇట్, వీచాట్, షీన్ వంటి పాపులర్ యాప్ లు ఉన్నాయి. 2022లో పబ్జీ, గరెనా ఫ్రీ ఫైర్ వంటి యాప్ లపై కూడా నిషేధం విధించారు. భారత్- చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా...