భారతదేశం, మార్చి 14 -- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం హోలీ సందర్భంగా 2025 మార్చ్​14, అంటే శుక్రవారం దేశంలోని అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. అహ్మదాబాద్, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, ఛండీగఢ్, డెహ్రాడూన్, గ్యాంగ్​టక్, గౌహతి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, ఇటానగర్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్​కతా, లక్నో, ముంబై, నాగ్​పూర్, న్యూదిల్లీ, పనాజీ, పట్నా, రాయ్​పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ వంటి నగరాల్లో నేడు బ్యాంకులు మూతపడి ఉంటాయని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి.

హోలీ వేడుకల్లో భాగంగా మార్చ్​ 13న దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో బ్యాంక్​లు మూతపడి ఉన్నాయి. 14 కూడా సెలవు ఉంది. 15న, శనివారం మాత్రం బ్యాంక్​లు పనిచేస్తాయి. మార్చ్​ 16 ఆదివారం వారాతంపు సెలవు ఉంది. ఇక మార్చ్​ 22 (రెండో శనివారం), మార్చ్​ 23 ఆదివారం, మార్చ్​ 30 ఆది...