భారతదేశం, మార్చి 1 -- Bank Employees Strike : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకు అధికారులు, ఉద్యోగులు మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు స‌మ్మె చేప‌ట్టనున్నారు. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ‌, అధికారుల‌ సంఘాలతో కూడిన‌ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో స‌మ్మె జ‌ర‌గ‌బోతుంది. అయితే తొలిసారిగా ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల ఉద్యోగులు, అధికారుల స‌మ్మెతో గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు స‌మ్మెకు సై అన్నారు. ఇప్పటికే కార్యచ‌ర‌ణ ప్రక‌టించిన యూఎఫ్‌బీయూ, స‌మ్మెకు ముందు చేయాల్సిన నిర‌స‌న కార్యక్రమాల‌ను నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌తో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు స‌మ్మె సైర‌న్ మోగించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11 వేల వివిధ బ్యాంకుల‌ బ్రాంచ్‌లు ఉండ‌గా, అందులో ప‌ని చేసే దాదాపు 35 ...