Hyderabad, మార్చి 8 -- బెంగళూరులోని ప్రముఖ వెజ్ హోటళ్లలో పాకశాల ఒకటి. ఇది అక్కడ చాలా ఫేమస్ భోజనాశాల. ఇక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుందనీ, నాణ్యతలోనూ మంచి పేరు కలిగి ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడీ హోటల్ బెంగుళూరులో మాత్రమే కాదు మొత్తం సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోతుంది. ఇందుకు ఆ హోటల్ యజమాని ఏర్పాటు చేసిన విచిత్రమైన బోర్డు కారణం. ఇంతకీ ఆ బోర్డులో ఏముంది, ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుసుకుందాం రండి.

బెంగుళూరులోని జేపీ నగర్‌లో ఉండే హోటల్‌‌లో భోజనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడున్న బోర్డును ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బోర్డు మీద రాసి ఉన్న అంశాన్ని హైలేట్ చేస్తూ "Clear instructions alright" అనే కామెంట్‌ను జత చేశాడు. దాని మీద యజమాని రాసిన అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఆ బోర్డు మీద ఏముందంటే.. ''This fac...