భారతదేశం, ఫిబ్రవరి 13 -- బంగ్లాదేశ్‌లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్​పీ) కూటమి అఖండ విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 12న పోలింగ్ జరిగిన 299 నియోజకవర్గాల్లో, కనీసం 212 స్థానాల్లో ఈ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.

స్థానిక మీడియా అంచనాల ప్రకారం.. బీఎన్‌పీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఈ కూటమి దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీని సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అధికారిక ఫలితాల్లోనూ ఇదే ధోరణి కొనసాగితే, బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రహ్మాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రి కావడం ఖాయం. మరోవైపు, జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 70 నియోజకవర్గాల్లో విజయం సాధించినట్లు శుక్రవారం వెలువడుతున్న అనధికారిక ఫలితాలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్​ ఎన్నికల ఫలితాలపై ఆ దేశ ఎన్నికల కమిషన్ నేడు పూర్త...