భారతదేశం, మార్చి 15 -- Bandi Sanjay : హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారిందని కేంద్ర హోంశాఖ బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగిస్తే కేంద్రం డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించే చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటై బీజేపీని బదనాం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

కరీంనగర్ లో బేటి బచావో, బేటి పడావో కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివే వంద మంది పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంతో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో బేటి పడావో తీసుకొచ్చిందన్నారు. కేంద్రం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.

ఆడపిల్ల లే...