భారతదేశం, మార్చి 22 -- Bandi Sanjay : డీలిమిటేషన్ పై చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నై సమావేశం దొంగల ముఠా సమావేశంగా అభివర్ణించారు. లిక్కర్ దొంగలు ల్యాండ్ మాఫియా ఒక్కటై చంబల్ లోయ ముఠాగా మారి సమావేశమయ్యారని విమర్శించారు.

కరీంనగర్ సమీపంలోని చామనపల్లిలో మెడిసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై ఘాటుగా స్పందించారు. డీఎంకే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు.

అనేక అవినీతి కుంభకోణాల్లో డీఎంకే కూరుకుపోయిందని దాన్నుంచి ప్రజలు దృష్టిని మళ్లించేందుకు డీలిమిటేషన్ పేరుతో దొంగలంతా సమావేశం అయ్యారని ఆరోపించారు. ఆలు లేదు..చూలు...