భారతదేశం, ఫిబ్రవరి 8 -- Bandi Sanjay : బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడంవల్ల భవిష్యత్తులో తెలంగాణలోని బీసీలు పోటీ చేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ది చెప్పారని... అలానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి రేవంత్ రెడ్డికి గాడిద గుడ్డు ఇవ్వాలని పిలుపునిచ్చారు.‌

ఉత్తర తెలంగాణలో కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించింది. రాంనగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు సాగిన యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మెదక్, ఆదిలాబా...