భారతదేశం, మార్చి 30 -- Bandi Sanjay : కరీంనగర్ లో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉగాది శుభాకాంక్షలతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పంచాంగం విశ్వావసు నామ సంవత్సరంలో దోపిడీ దొంగతనాలు, ప్రజాప్రతినిధుల అవినీతి పెరిగిపోతుందని, విచిత్రమైన వింతవ్యాధి సోకుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనను గమనిస్తే నిజమే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, స్వగృహంలో తల్లితో కలిసి మన్ కి బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియాతో కలిసి ఉగాది పచ్చడి స్వీకరించిన మంత్రి బండి సంజయ్ కొత్త పంచాంగం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్ వైఖరి ఎంఐఎంపై ఫైర్ అయ్యారు.‌ విశ్వావసు నామ సంవత్సర అంటే విశ్వమంతా శుభం జరుగుతుందన్నారు. ప్రధానమ...