భారతదేశం, ఫిబ్రవరి 17 -- Bandi Sanjay : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో..ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే... ఐఏఎస్ లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లు ఉందన్నారు.

టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు ఎంపీలు రఘునందన్ రావు, జ...