భారతదేశం, ఫిబ్రవరి 17 -- Bandi Sanjay: కరీంనగర్ లో కేేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ స్టేడియంలో ఆరు రోజుల పాటు స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'స్వదేశీ మేళా'' ముగింపు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరై రాహుల్ గాంధీ కులం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కులగణన బిసి రిజర్వేషన్ పై మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతల మాట్లాడిన మాటలు టీవీల్లో చూశానని చెప్పిన బండి సంజయ్, తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందని, రాజీవ్ గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్ గాంధీ కూడా హిందువేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు రాజీవ్ గాంధీ హిందువు ఎట్లా అవుతాడో చెప్పాలన్నారు.

రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్శీ మతస్థుడు. పర్సియాలోని ముస్లిం సంతతికి చెందిన వాళ్ల పూర్వీకులు ఇం...