భారతదేశం, ఫిబ్రవరి 14 -- Bandi Sanjay: బండి సంజయ్ టిబెట్ అధ్యాత్మిక గురువు దలైలామాతో భేటీ కానున్నారు. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించిన సమయంలో వేలాది మంది టిబెటియన్ శరణార్ధుల ఇండియాకు తరలివచ్చారు. వారందరికీ కేంద్ర ప్రభుత్వం కర్నాటకలోని మైసూర్ జిల్లా బైలకుప్పే ప్రాంతంలో పునరావాసం కల్పించింది. వీరికి నివాసాలను ఏర్పాటు చేయడంతోపాటు వ్యవసాయం చేసేందుకు అనువుగా 15 వేల ఎకరాలకుపైగా అటవీ స్థలాన్ని కేటాయించింది.

దక్షిణ భారతదేశంలోని టిబెటియన్ బౌద్ధ మత కేంద్రం ప్రస్తుతం బైలకుప్పేలో ఉంది. ఈ ప్రాంతంలో 15 వేల మందికిపైగా టిబెటియన్ శరణార్థులు ఇక్కడ నివసిస్తున్నారు. టిబెటియన్ బౌద్ధ సంప్రదాయాలకు అనుగుణంగా అనేక మఠాలు, మఠ పాఠశాలలు, దేవాలయాలను నిర్మించుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బైలకుప్పే కు చేరుకుని టిబెటియన్ శర...