Hyderabad, మార్చి 27 -- అరటి పండు అందరికీ అందుబాటు ధరలోనే లభిస్తుంది. అద్భుతమైన పోషక గుణాలు కలిగిన పండు ఇది. దీనిలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ ఉంటాయి. అరటిపండ్లు మిగతా పండ్లతో పోలిస్తే త్వరగా చెడిపోతాయి. ఇంటికి తెచ్చిన రెండు మూడు రోజుల్లోనే నల్లగా, మెత్తగా మారిపోతాయి. నల్ల మచ్చలు ఏర్పడతాయి. వీటిని తినలే్ పడేసే వారే ఎక్కువ. నిజానికి వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేస్తే నలుపు దనం రాకుండా వారం పాటూ తాజాగా ఉంటాయి. అందుకు కొన్ని సింపుల్ మార్గాలు ఉన్నాయి.

అరటిపండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఎరుపు అరటి, కర్పూరవల్లి, ఆకుపచ్చ అరటి వంటి అనేక రకాల అరటిపండ్లు మార్కెట్లో లభిస్తాయి. ఏవి కొన్నా కూడా రెండు మూడు రోజులకే అవి నల్లగా మారడం మొదలవుతాయి. వీటిని తాజాగా ఉంచే చిట్కాలను ఫాలో అయితే ఈ సమస్య రాదు.

అరటి పండు కాండంను అల్యూమి...