Hyderabad, మార్చి 20 -- మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వారితో పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు వారిపై విజయాలు కూడా సాధిస్తున్నారు. అయితే కొన్ని నమ్మకాలు, ఆచారాలు మాత్రం ఇంకా మహిళలను అనుమతించని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ ప్రదేశాలను గురించి తెలుసుకుందాం.

అమెరికాలోని మేరీల్యాండ్ లో బర్నింగ్ రీ క్లబ్ ఉంది. ఇది ఒక గోల్ఫ్ క్లబ్. ఇది కేవలం పురుషులకు మాత్రమే. మహిళలకు నో ఎంట్రీ. ఇక్కడ ప్రతి అమెరికా అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తికి సభ్యత్వం ఇస్తారు. అయితే ఇప్పటివరకు ఏ మహిళా కూడా ఈ క్లబ్ లోకి ప్రవేశించలేదు. పూర్తిగా ఇది పురుషాతిపత్య క్లబ్. దీని సంప్రదాయాలు కూడా పురుషులకు అనుకూలంగానే ఉంటాయి.

గ్రీస్‌లోని మౌంట్ అత్తోస్ అనే కొండ ప్రాంతం ఉంది. 1000 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఒక్క మహిళ కూడా వెళ్లలేదు. మహిళల...