Hyderabad, మార్చి 5 -- అబ్బాయిలకు బట్టతల అంటేనే భయం. మగవారికే ఎక్కువగా బట్టతల వస్తుంది. జుట్టు రాలుతూ ఉంటే బట్టతల ఎక్కడ వచ్చేస్తుందని భయపడే మగవారు ఎంతోమంది ఉన్నారు. కొందరికి 50 ఏళ్లు దాటాక బట్టతల వస్తూ ఉంటే మరి కొందరికి 20 ఏళ్లకే వచ్చేస్తుంది. ఇలా చిన్న వయసులోనే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసుకోండి.

ఒక వ్యక్తికి బట్టతల వచ్చే అవకాశం ఉంటే కనిపించే మొదటి లక్షణం తల నుండి వెంట్రుకలు ఎక్కువ మొత్తంలో రాలిపోతాయి. కొన్నిసార్లు గుత్తులు గుత్తులుగా, ప్యాచెస్ లాగా కూడా రాలిపోతాయి. అలా రాలిపోయాక అక్కడ నున్నగా చర్మం ఏర్పడుతుంది. హెయిర్ ఫోలికల్స్ కనిపించవు. ఇలా ప్యాచెస్ లాగా జుట్టు రాలిపోతే ఆ వ్యక్తికి బట్టతల వచ్చేస్తుందని అర్థం. దీనికి కారణాలు రెండు కావచ్చు. మొదటిది జన్యుపరమైనది. రెండవది పోషకాహార లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది.

బట్టతల వచ్చే వ్యక్తుల్...