Hyderabad, మార్చి 10 -- బట్టతల జన్యుపరంగా అంటే వారసత్వంగా వస్తే దాన్ని నిరోధించడం చాలా కష్టం. కానీ పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతూ ఉంటే మీరు దాన్ని అడ్డుకోగలరు. దానికి కావాల్సిందా మీరు పౌష్టికాహారాన్ని తీసుకోవడమే. ముఖ్యంగా కొన్ని విటమిన్ల లోపం జుట్టు రాలడాన్ని పెంచుతుంది. కాబట్టి ఏ విటమిharithaన్ల లోపం వల్ల బట్టతల వస్తుందో తెలుసుకుందాం.

విటమిన్ డి శరీరంలో లోపిస్తే బట్టతల వచ్చే అవకాశం పెరుగుతుంది. విటమిన్-డి లోపం వల్ల జుట్టు పొడిబారినట్టు అవుతుంది. విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉంటే జుట్టు కూడా తెల్లగా మారుతుంది. విటమిన్ డి లోపాన్ని నివారించడానికి పుట్టగొడుగులు, గుడ్లు వంటివి తినాలి. అలాగే ప్రతిరోజు సూర్యరశ్మిలో కాసేపు నిల్చోవలసిన అవసరం ఉంది.

విటమిన్ ఏ లోపం వల్ల జుట్టు పలుచబడిపోతుంది. జుట్టు రాలిపోవడం పెరుగుతుంది. విటమిన్ ఏ లోపం వల్లే చు...