Hyderabad, ఫిబ్రవరి 15 -- Balakrishna Gifted Costly Car To Thaman: కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతుంటాయి. వాటికి యమ క్రేజ్ ఉంటుంది. అది హీరో-డైరెక్టర్ కాంబో అయినా లేదా మ్యూజిక్ డైరెక్టర్-హీరో అయినా సరే. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషనే నందమూరి నటసింహం బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌ది.

బాలకృష్ణకు వరుసగా బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన తమన్ నందమూరి కుటుంబానికి బాగా దగ్గరైపోయాడు. ఎంతలా అంటే చివరికీ బాలయ్య సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి సైతం నందమూరి తమన్ అని చెప్పేంతలా ఆ ఇంటివాడు అయ్యాడు ఈ సంగీత దర్శకుడు.

ఇక బాలయ్య-తమన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో బీజీఎమ్, సంగీతం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అఖండ మూవీతో మొదలైన వీరి ప్రయాణం లేటెస్ట్ డాకు మహారాజ్ వరకు కొనసాగుతోంది. బాలకృష్ణకు సరితూగే బీజీఎమ్ కొట్టేది కేవలం తమన...