భారతదేశం, ఏప్రిల్ 14 -- Balakrishna: ఓ స్టార్ హీరో న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావ‌డం చాలా అరుద‌నే చెప్పుకోవాలి. అలాంటి అరుదైన రికార్డ్ బాల‌కృష్ణ కెరీర్‌లో న‌మోదైంది. బాల‌కృష్ణ హీరోగా న‌టించిన బంగారు బుల్లోడు, నిప్పుర‌వ్వ సినిమాలు 1993 సెప్టెంబ‌ర్ 3న ఒకే రోజు థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. బాల‌కృష్ణ మూవీతో మ‌రో బాల‌కృష్ణ మూవీనే బాక్పాఫీస్ వ‌ద్ద పోటీప‌డింది. తెలుగులో స్టార్ హీరో న‌టించిన సినిమాలు ఒకే రిలీజ్ కావ‌డం అన్న‌ది బాల‌కృష్ణ కెరీర్‌లో మాత్ర‌మే జ‌రిగింది. ఈ రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌గా...నిప్పుర‌వ్వ మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది.

బంగారు బుల్లోడు సినిమాకు ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ర‌మ్య‌కృష్ణ‌, ర‌వీనా టాండ‌న్ హీరోయిన్లుగా న‌టించారు. ట్రయాంగిల్ ల‌వ్‌స్టోరీగా ...