Hyderabad, జనవరి 3 -- Trolling On Balakrishna Daaku Maharaaj Dabidi Dibidi Song: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ఇటీవల డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో బాలకృష్ణతోపాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతెలా స్టెప్పులేసింది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అయితే, ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అందుకు కారణం సాంగ్‌లో బాలకృష్ణ వేసిన స్టెప్పులే.

ఈ సాంగ్ వీడియో బ్లూ షర్ట్, నీలం జాకెట్, బ్రౌన్ ప్యాంట్, సన్ గ్లాసెస్ ధరించి రాజులా కూర్చొన్న బాలకృష్ణతో స్టార్ట్ అవుతుంది. ఇక ఊర్వశి రౌతేలా క్ర...