భారతదేశం, మార్చి 24 -- Balabhadrapuram Cancer Screening : తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి ఎమ్మె్ల్యే బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు అవ్వడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నట్టు సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అంశంపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్ 2024 నుంచి నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్‌ను నిర్వహిస్తోందని ఇ...