భారతదేశం, ఫిబ్రవరి 22 -- యూరోపియన్ మోటార్ సైకిల్ బ్రాండ్ కేటీఎమ్ కోసం బజాజ్ ఆటో సుమారు రూ .1,360 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. బజాజ్ ఆటో నెదర్లాండ్స్‌కు చెందిన తన అనుబంధ సంస్థ బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ(బీఎఐహెచ్‌బీవీ) ద్వారా ఆస్ట్రియాలోని పీయరర్ బజాజ్ ఏజీ(పీబీఏజీ)లో 49.9 శాతం వాటాను కలిగి ఉంది. కేటీఎమ్ మోటార్ సైకిళ్లను కలిగి ఉన్న పీర్ మొబిలిటీ ఏజీ 75శాతం వాటాను కలిగి ఉంది. తనను తాను కాపాడుకోవడానికి అత్యవసర నిధి అవసరమని నవంబర్‌లో కేటీఎం తెలిపింది. రుణదాతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దివాలా తీయకుండా ఉండేందుకు కేటీఎమ్‌కి ఇప్పుడు పెట్టుబడులు అవసరం.

నెదర్లాండ్స్‌లోని బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీలో సుమారు రూ.1,350 కోట్లు పెట్టుబడికి బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. ఈ నిధిని కేట...