Hyderabad, ఫిబ్రవరి 25 -- హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాలకు, శుభకార్యాలకు రకరకాల ఆకులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పరమశివుడి పూజలో బిల్వ పత్రాలను అత్యంత ముఖ్యమైన పదార్థంగా భావిస్తారు. మహాశివరాత్రి, శ్రావణమాసపు శివుడి పూజల సమయంలో బిల్వపత్రాలను సమర్పించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. ఇలా భక్తితో శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి.

బిల్వపత్రాలలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B1, విటమిన్ B6తో పాటు కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులైన డయబెటీస్ నుండి పైల్స్, గుండె ఆరోగ్యం వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. బిల్వపత్రం తినడం వల్ల ఆరోగ్యానికి లభించే ప్రయోజనాలతో పాటు దాన్ని సేవించే సరైన విధానం గురించి తెలుసుకుందాం.

బిల్వపత్రంలో ఫైబర్ ప...