Hyderabad, మే 2 -- Bael Fruit: వెలగపండును వుడ్ యాపిల్, బేల్ అని పిలుస్తారు. ఇది వేసవిలో ఎక్కువగా దొరికే పండు. బయట చాలా గట్టిగా ఉన్నా... లోపల గుజ్జు మాత్రం మెత్తగా ఉంటుంది. ఈ పండును వేసవిలో కచ్చితంగా తినాల్సిందే. ఇది ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. దీంతో చేసే జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ నీరు, కొబ్బరినీళ్లు రిఫ్రెష్ పానీయాలుగా ఎలా ఉపయోగపడతాయో... వెలగపండుతో చేసిన జ్యూసులు కూడా వేసవిలో అంతా రిఫ్రెష్‌మెంట్ ఇస్తాయి. దీన్ని తినడం వల్ల ఉన్న ప్రయోజనాలను పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.

వెలగ పండులో మన ఆరోగ్యానికి దోహదపడే పోషకాలు ఎన్నో ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే మన రోగ నిరోధక వ్యవస్థకు మేలు చేసే విటమిన్ ఏ కూడా ఈ పండులో పుష్కలంగా ఉంటుంది. ప...