భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీకి మంగళవారం (ఫిబ్రవరి 11) తెరలేచింది. చైనా లోని కింగ్ దావోలో ఈ టోర్నీ ఆరంభమైంది. 12 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో గోల్డ్ కొట్టడమే లక్ష్యంగా భారత్ రేసులోకి దిగుతోంది. కానీ స్టార్ షట్లర్ పీవీ సింధు గాయంతో దూరమవడం టోర్నీలో భారత అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. పురుషుల జట్టు బలంగానే కనిపిస్తున్నా.. మహిళల జట్టు మాత్రం వీక్ గా ఉంది.

ఆసియా మిక్స్ డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో పోటీపడుతున్న 12 దేశాలను 4 గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్- ఎలో చైనా, చైసీన్ తైపీ, సింగపూర్.. గ్రూప్-బిలో ఇండోనేసియా, మలేసియా, హాంకాంగ్.. గ్రూప్-సిలో జపాన్, కజకిస్థాన్, థాయ్ లాండ్.. గ్రూప్-డిలో దక్షిణ కొరియా, భారత్, మకావు ఉన్నాయి. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ లొ టా...