Hyderabad, ఏప్రిల్ 4 -- మనలో చాలా మందికి నిద్ర సమస్యలుంటాయి. నిద్ర పట్టడం అదృష్టంగా ఫీలయ్యేవారు ఈ రోజుల్లో చాలా మందే ఉన్నారు. అయితే ఎంతో మందికి ఒత్తిడి, ఆలోచనలు, పీడకలలు, కెఫైన్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ప్రస్తుత జీవన శైలి కారణంగా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు చాలా మందిలో కామన్‌గా మారిపోయి ఉండొచ్చు. కానీ, ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలు చూపిస్తుందట. ప్రత్యేకించి నిద్ర మధ్యలో మెలకువ వచ్చిన తర్వాత మరోసారి నిద్రపట్టక ఇబ్బందిపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని యూకేలోని సర్రే యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో తేలింది.

17 నుంచి 28 మధ్య 646 మంది విద్యార్థులపై ఈ రీసెర్చ్ జరిపారు. వారి ఆరోగ్యం, అలవాట్లు, వ్యక్తిగత విషయాలు, డిప్రెషన్ లక్షణాలు, నిద్రపోవడానికి పట్టే సమయాలను నమోదు చేసుకున్నారు.

కొందరు శరీరతత్వా...