Hyderabad, ఫిబ్రవరి 17 -- పెళ్లయిన భార్యాభర్తలు అప్పుడే పిల్లలను వద్దనుకుంటారు. అలాగే ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డకు కొంతవరకు గ్యాప్ ఉండాలని అనుకుంటారు. ఆ సమయంలోనే గర్భం ధరించకుండా జనన నియంత్రణ పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు.

అలాంటి జనన నియంత్రణ పద్ధతుల్లో హార్మోన్లను ప్రభావితం చేసే గర్భనిరోధక మాత్రలు, ఇంప్లాంట్స్ కూడా భాగమే. ఇలాంటి హార్మోన్లను ప్రభావితం చేసే గర్భనిరోధకాలను వాడడం వల్ల మహిళలకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందని కొత్త అధ్యయనం చెబుతుంది.

ప్రపంచంలో ఎన్నో జనన నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ భూమిపై ఉన్న మహిళల్లో పాతిక కోట్ల మంది మహిళలు వినియోగిస్తున్న పద్ధతి గర్భనిరోధక మాత్రలు లేదా ఇంప్లాంట్లను వాడడం. వీటిని వాడేవారు భవిష్యత్తులో స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కలిగి ఉంటారని కొత్త అధ్యయనం నిర్ధారించింది. ...