Hyderabad, మార్చి 11 -- చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటివి శరీరాన్ని రోగాల బారిన పడేలా చేస్తాయి. నేటి కాలంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తినకపోవడం. మీరు తినే ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతూ పోతుంది. అది చెడు కొలెస్ట్రాల్ గా మారుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి సింపుల్ చిట్కా ప్రతిరోజు వాకింగ్ చేయడం. నడక చెడు కొలెస్ట్రాల్ ను ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు అరగంట పాటు వేగంగా వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి .మీరు నడిచినప్పుడు అది శరీరంలోని ప్రతి కండరాన్ని ప్రభావితం చేస్తుంది. కండరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. నిరంతరం ప్రతిరోజూ నడవడం వల్ల శరీరంలో ...