Hyderabad, జనవరి 28 -- నోటి నుంచి వచ్చే దుర్వాసన ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాదు ఇతరుల ముందు మీకు చాలాసార్లు ఇబ్బంది కలిగిస్తుంది. నోటి నుండి దుర్వాసన రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ దంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం, చిగుళ్లలో వాపు, పైరియా లేదా రక్తస్రావం, నాలుకను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, నోరు పొడిబారడం దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే, ఈ హోం రెమెడీస్ మీ సమస్యను అధిగమించడానికి మీకు సహాయపడతాయి.

లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్రష్ చేసిన తర్వాత నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లవంగాల సాయంతో ఉపశమనం పొందవచ్చు. ఈ లవంగాలను బ్యాగులో లేదా జేబులో కొన్ని ఉంచుకోండి. రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ఈ లవంగాలను నమిలేందుకు ప్రయత్నించండి. లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరి...