Hyderabad, ఏప్రిల్ 2 -- ఇంట్లో బ్యాక్టీరియా చేరిందంటే అనారోగ్యాలు రావడం మొదలవుతాయి. చాలామంది టాయిలెట్ లోనే అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది అనుకుంటారు. స్లీప్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం మీ టాయిలెట్ సీటు మీద ఉన్న బ్యాక్టీరియా కంటే ఒక వారం రోజులు మీరు వాడిన దిండుపైనా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.

పరుపులు, బెడ్ షీట్లు, దిండ్లు అన్నింటినీ ప్రతి వారం మార్చుకోవాలి. వాటిని ప్రతి వారం ఉతుక్కోవాలి. లేకుంటే వాటిపై బ్యాక్టీరియా అధిక మొత్తంలో పేరుకుపోతుంది. నాలు వారాలపాటు ఆ దిండును ఉతక్కుండా ఉంచితే ప్రతి చదరపు అంగుళంలో బ్యాక్టీరియా కాలనీలే ఏర్పడుతాయి. వాటిని వాడడం చాలా ప్రమాదకరం.

నివేదిక చెబుతున్న ప్రకారం మీ దిండును ఒక వారం రోజులు వాడిన తర్వాత దానిపై 17,000 కంటే ఎక్కువ బ్యాక్టీరియాల చేరుతాయి. దాన్ని అలా నెల రోజులు వదిలేస్తే ప్రతి చదరపు అంగుళానికి మూడు నుం...