Hyderabad, ఫిబ్రవరి 28 -- ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని పొంగిపోతారు. పుట్టిన ఆ బిడ్డను చూసి మురిసిపోతారు. తమ పాపకు అందమైన పేరు పెట్టాలని ఆలోచిస్తారు. ఆ పేరు అందంగానే కాదు ఆధునికంగా, అర్థవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే పిల్లల పేరు వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని చెప్పుకుంటారు. మీ ఇంట్లో పాప పుడితే మీకు నచ్చే అందమైన పేర్లను ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ ఆధునికంగా ఉండేవే. కింద ఇచ్చిన పేర్లలో మీకు నచ్చినది ఎంపిక చేసుకుని మీ పాపకు పెట్టండి

వీరి స్వభావం ప్రశాంతంగా, వినయంగా ఉండాని కోరుకుంటే మీ పాపకు ఈ ఆధునిక పేరు పెట్టవచ్చు.

యానిషా అనే పేరుకు అర్థం ఆకాంక్షతో కూడిన, ఎత్తైన ఆశలతో ఉండే వ్యక్తి అని. మీ పాపకు ఈ అపురూపమైన, ఆధునిక పేరు పెడితే చక్కగా ఉంటుంది.

హేమాలి అంటే మంచులా చల్లనిది అని అర్థం. ఈ కాలం పాపకు ఈ ఆధునిక పేరు చక్కగా సర...