భారతదేశం, మార్చి 1 -- Babli Project Water : తెలంగాణలోని తాగునీటి అవసరాల కోసం మహారాష్ట్ర గోదావరిపై నిర్మించిన బాబ్లీ గేట్లను శనివారం ఓపెన్ చేశారు. కేంద్ర జల వనరుల సంఘం ఇరిగేషన్ టీం సమక్షంలో 0.6 టీఎంసీల నీటిని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ నదీ పరివాహక ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని వదిలిపెట్టినట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తివేయగా.. ఈరోజు రాత్రి వరకు బాసర తీరానికి ఆ జలాలు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు.

కేంద్రజలవనరుల సంఘంతో మహారాష్ట్ర తెలంగాణ మధ్య గతంలో కుదిరిన ఒప్పందం మేరకు వేసవిలో తాగునీటి అవ సరాల నిమిత్తం గోదావరి నీటిని వదలడం ఆనవాయితీగా వస్తుంది. 0.6 టీఎంసీ తాగు నీటి కోటా అనంతరం గే...