Hyderabad, మార్చి 1 -- Baapu OTT Streaming Date Announced Officially: తెలుగులో వచ్చిన బలగం సినిమా ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కోర్ ఫ్యామిలీ ఎమోషనల్ సన్నివేశాలతో మలిచిన బలగం అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాంటి తరహాలో ఈ మధ్య చాలా వరకు సినిమాలు వస్తున్నాయి.

రీసెంట్‌గా తెలుగులో దాదాపుగా బలగం సినిమా తరహాలోనే వచ్చిన మూవీ బాపు. ఏ ఫాదర్ స్టోరీ (ఒక తండ్రి కథ) అనేది ట్యాగ్‌లైన్. తెలుగు చిత్రాల్లో అనేక పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే బాపు. ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా చిత్రంగా బాపు రూపొందింది.

బాపు సినిమాకు దయా దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి బాపు మూవీని నిర్మించారు. బాపు ...