Hyderabad, ఫిబ్రవరి 22 -- Baapu OTT Release Platform: తెలుగులో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాక్టర్ బ్రహ్మాజీ. తనదైన స్టైల్ యాక్టింగ్‌తో కామెడీ, ఎమోషనల్, సీరియస్ పాత్రల్లో మెప్పించారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు డార్క్ కామెడీ డ్రామా చిత్రం బాపు.

కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన బాపు సినిమాకు దయా దర్శకత్వం వహించారు. బాపు సినిమాలో బ్రహ్మాజీతోపాటు సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సినిమాతో పేరు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి, యంగ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ, డైరెక్టర్, నటుడు అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ప్రధాన పాత్రలు పోషించారు.

బాపు సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ ఏర్పడింది. దగ్గుబాటి రానా, రష్మిక మందన్నా వంటి స్టార్ సెలబ్రిటీలు బా...