Hyderabad, డిసెంబర్ 16 -- చలికాలంలో ఆహారం అరగడం కష్టంగా ఉంటుంది. అలాగే స్నాక్స్‌ను కూడా ఇష్టంగా తింటారు. అలాగే పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం వంటివి చేస్తుంటాం. నిజానికి వేరుశెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేరుశెనగలో కాల్షియం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. పల్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేరుశెనగను పేద ప్రజల బాదం పప్పుగా కూడా పిలుస్తారు. అయినప్పటికీ ఆయుర్వేద ఆహార నియమాల ప్రకారం వేరుశెనగ తిన్న వెంటనే నీళ్లు తాగ కూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది.

వేరుశెనగలు తినడం వల్ల శరీరానికి వెచ్చదనం వస్తుంది. వాటిని తిన్నాక శరీర వేడి పెరుగుతుందని పోషకాహార నిపుణుడు వరుణ్ కత్యాల్ వివరించారు. అటువంటి పరిస్థితిలో, వేరుశెనగ తిన్న త...