Hyderabad, ఏప్రిల్ 2 -- టమోటోలకు భారతీయ ఇళ్లల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి వంటకంలో టమోటోలను వినియోగిస్తూనే ఉంటారు. ఇవి ఆహార రుచిని పెంచడంతోపాటు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. అయితే టమోటోలను కొంతమంది తినకూడదు. వారే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు.

టమోటాలు ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి అన్నది నిజమే. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మాన్ని మెరిపించడం, కంటిచూపును మెరుగుపరచడం వంటి విషయాల్లో ఎంతో సహాయపడతాయి. టమోటోలు ప్రతిరోజూ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాదు టమోటాలు తక్కువ ధరకే లభిస్తూ పేదవాడి ఆహారంగా కూడా మారాయి. అయితే కిడ్నీ రోగులు మాత్రం టమోటోలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతూ వస్తోంది. కిడ్నీ రోగులు టమోటోలు తినడం ఎంతో హానికరం. ఎందుకంటే టమోటోలలో...