భారతదేశం, ఫిబ్రవరి 17 -- జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. తన హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ ఎస్‌యూవీ, ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. కొత్త ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ భారత్‌లో రూ. 2,49,00,000 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ కారు 10 సంవత్సరాల కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాజమాన్య ప్రయోజనంతో వస్తుంది.

'ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ భారతదేశానికి అత్యుత్తమ కార్లను తీసుకురావాలనే మా నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయి. కొత్త ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ లగ్జరీపై రాజీపడకుండా అత్యుత్తమ పనితీరును కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించాం.' అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు.

ఆడి RS Q8 పెర్ఫార్మెన్స్ 8 స్టాండర్డ్, 9 ప్రత్యేక కలర్ ఆప్షన్లలో అందిస్తారు. దీని డిజైన్ ముందుగా కంటే మరింత స్పోర్టీగా మారింది. ఇందులో కంప...