భారతదేశం, ఫిబ్రవరి 9 -- AU Scholars Protest : రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక యూనివ‌ర్శిటీల్లో ఒక‌టైన ఆంధ్ర యూనివ‌ర్సిటీలో రీసెర్చ్ స్కాల‌ర్స్ ఆందోళ‌న చేప‌ట్టారు. ప‌రిశుభ్రమైన భోజ‌నం, తాగేందుకు మంచి నీరు వంటి క‌నీస అవ‌స‌రాల‌ను అందించాల‌ని రీసెర్చ్ స్కాల‌ర్స్ బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా యూనివ‌ర్సిటీ అడ్మినిస్ట్రేష‌న్‌లో క‌ద‌లిక వ‌చ్చింది. సోమ‌వారం రీసెర్చ్ స్కాల‌ర్స్‌తో స‌మావేశం నిర్వహించేందుకు యూనివ‌ర్సిటీ అధికారులు సిద్ధపడ్డారు.

హాస్టల్‌లో నీరు తాగ‌లేక‌పోతున్నామ‌ని, భోజ‌నం తినలేక‌పోతున్నామంటూ ఆంధ్ర యూనివ‌ర్సిటీలోని జీఎంసీ బాల‌యోగి రీసెర్చ్ హాస్టల్ ఎదుట ప‌రిశోధ‌క విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. అధికారుల‌కు ఎన్ని సార్లు చెప్పిన‌ప్పటికీ ప‌ట్టించుకోవ‌టం లేదని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ఆందోళ‌న గురించి స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన...