భారతదేశం, ఫిబ్రవరి 22 -- Attitude Star: రామ్‌న‌గ‌ర్ బ‌న్నీ త‌ర్వాత ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా న‌టిస్తోన్న మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చంద్ర‌హాస్‌కు జోడీగా మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా బ‌రాబ‌ర్ ప్రేమిస్తా మూవీలోని ఓ మాస్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. 'రెడ్డి మామ' అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మ్యూజిక్ అందించారు. . ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు ప్ర‌శంసించారు. క్లాస్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంద‌ని తెలిపారు.

బ‌రాబ‌ర్ ప్రేమిస్తా సినిమా షూటింగ్ పూర్త‌యింది. త్వరలోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. గెడా చందు, గాయత్రి...