భారతదేశం, ఏప్రిల్ 15 -- Attack On CM: ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి Ys Jagan మీద దాడి Attcakతర్వాత విజయవాడ పోలీసుల పనితీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షన్ ప్రభావిత Faction Districts జిల్లాల్లో కూడా ప్రశాంతంగా సాగిన Memantha Siddam బస్సు యాత్ర విజయవాడకు వచ్చేసరికి ఎందుకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైరవీలతో పోస్టింగులు Postings తెచ్చుకున్న అధికారులు నగరంలో తిష్ట వేయడమే సిఎం మీద దాడికి అసలు కారణమనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి మీద దాడి వ్యవహారంపై రాజకీయ విమర్శల మాటెలా ఉన్నా పోలీసుల పనితీరును మాత్రం ప్రశ్నిస్తోంది. వందలాది సాయుధ పోలీసుల నడము ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్‌ గా చేసుకుని దాడి చేయగలగడంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

విజయవాడ పోలీసులు కొన్నేళ్లుగా విఐపిల సేవకే ...